ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు నెటిజన్స్. ముఖ్యంగా డైరెక్టర్ బాబిని మెగా ఫ్యాన్స్ బూతులు తిట్టడం ఇండస్ట్రీలో పెను సంచలనం గా మారుతోంది. అందుకు కారణం నిన్నటి రోజున రిలీజ్ అయిన చిరంజీవి 154వ సినిమా అప్డేట్ గురించి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి ఒక రేంజ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోని రీసెంట్గా విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే నిన్నటి రోజున దీపావళి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ను తెలియజేశారు డైరెక్టర్ బాబి. ఇక చిరంజీవి, బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి సంబంధించి టైటిల్ ని కూడా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టారు.
కానీ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ ఊర మాస్ లో ఉన్న చిరంజీవిని మాత్రమే పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పోస్టర్ చూస్తే చిరంజీవి గతంలో నటించిన ముఠామేస్త్రి సినిమా గుర్తుకు వస్తోందని పలు రకాలుగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వీటికి తోడు చెవికి పోగు, నోట్లో బీడీ, లుంగీ ధరించిన తీరు చూస్తే ఊర మాస్లో అదరగొట్టేశాడు కానీ ఈ సినిమా కోసం చిరంజీవి చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.
వాస్తవానికి చిరంజీవికి స్మోకింగ్ అలవాటు లేదు కానీ కొన్ని సినిమాలు టైమ్ లో మిల్క్ మేడ్ సిగరెట్ ని మాత్రమే ఉపయోగించే వారట. ఈ సినిమాలో చిరంజీవి అలా పొగను ఊదడానికి రింగులు రావడానికి చిరంజీవి నిజంగానే స్మోకింగ్ చేశారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబినే చేయించారని సమాచారం. అందుచేతనే బాబీని మెగా ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇక తన హీరో చేత ఇలాంటి పని చేయిస్తావా అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు మెగా అభిమానులు.