ఆ క్రేజీ హీరో అంటే మెగా హీరోకు భ‌యం ఎందుకు… ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగింది..!

-

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఒకే రోజు రెండు, అంత‌కు మించి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతెందుకు రెండు వారాల క్రితం సీనియ‌ర్ హీరో నాగార్జున మ‌న్మ‌థుడు 2, అన‌సూయ క‌థ‌నం, విశాల్ అయోగ్య రిలీజ్ అవ్వ‌గా ఆ మ‌రుస‌టి రోజు ఏ మాత్రం జంకు లేకుండా బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ కొబ్బ‌రిమ‌ట్ట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ట్విస్ట్ ఏంటంటే కొబ్బ‌రిమ‌ట్ట సినిమా ముందు మిగిలిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 గురించి మాట్లాడుకోవ‌డ‌మే వేస్ట్ అయ్యింది.

ఇక సాహో వాయిదాతో కుర్ర స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 30న రావాల్సిన నాని గ్యాంగ్‌లీడ‌ర్ సెప్టెంబ‌ర్ 13కు వెళ్లింది. ఇక అదే డేట్‌కు ఎప్పుడో మెగా హీరో వ‌రుణ్ తేజ్ వాల్మీకి ఫిక్స్ అయ్యింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్మీకి. తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే అదే రోజు నాని, విక్రమ్‌ కె కుమార్‌ల గ్యాంగ్‌ లీడర్‌ కూడా రిలీజ్‌ అవుతుండటంతో ఆ సినిమాతో పోటీప‌డి ఆగ‌లేమ‌ని డిసైడ్ అయిన వాల్మీకి యూనిట్ త‌మ సినిమాను వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న సాహో మేనియా సెప్టెంబర్‌ 13 వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా వస్తుందని భావిస్తున్నారు.

ఇక నాని సినిమాకు పోటీగా వెళితే వాల్మీకి బ‌డ్జెట్‌, మార్కెట్ నేప‌థ్యంలో సోలో వ‌సూళ్లు ద‌క్క‌వ‌ని కూడా డిసైడ్ అయ్యి వెన‌క‌డుగు వేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాని దెబ్బ‌తో మెగా హీరో కాస్త ఓ అడుగు వెన‌క్కు వేశాడ‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ న‌డుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version