మెగా హీరోల వార్‌… బ‌న్నీకి చెర్రికి ఎక్క‌డ చెడింది…

-

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ యంగ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్ వ‌ర్సెస్ అల్లు అర్జున్ మ‌ధ్య న‌డుస్తోన్న ఇంట‌ర్నల్ వార్ పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. రామ్‌చ‌ర‌ణ్ (చెర్రీ), అల్లు అర్జున్ (బ‌న్నీ) మ‌ధ్య అస‌లు ఎందుకు ఈ వార్ న‌డుస్తోంది ?  రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న సైరా సినిమాపై కేవ‌లం మెగా హీరోలే కాకుండా టోట‌ల్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో మెజార్టీ హీరోల‌తో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోలు సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్ లాంటి వాళ్లు సైతం త‌మ వంతుగా ఈ సినిమాకు ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.

మ‌రి అల్లు అర్జున్ సైరా విష‌యంలో ఎందుకు ?  సైలెంట్‌గా ఉంటున్నాడ‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఈ విష‌యంపై ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాపిక్ చ‌ర్చ‌ల ప్ర‌కారం చాలా కార‌ణ‌లే ఉన్నాయి. బ‌న్నీ ముందు నుంచి మెగా కాంపౌండ్ కాకుండా సొంత బ్రాండ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక నాలుగేళ్ల‌గా చ‌ర‌ణ్ వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు బ‌న్నీవ‌రుస హిట్ల‌తో దూసుకుపోయాడు. రెండేళ్లుగా సీన్ రివ‌ర్స్ అయ్యింది.

చ‌ర‌ణ్ ధృవ‌, రంగ‌స్థ‌లం లాంటి హిట్ల‌తో జోరు మీదున్నాడు. రంగ‌స్థ‌లం నాన్ బాహుబ‌లి రికార్డ‌ల‌న్నింటిని దాటేసి ముందు ఉంది. ఇక బ‌న్నీ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయ్యింది. డీజే, నా పేరు సూర్య లాంటి ప్లాపుల‌తో ఉన్నాడు. మ‌రోవైపు నిర్మాత‌గా కూడా చ‌ర‌ణ్ దూసుకుపోతున్నాడు. ఇక అదే టైంలో మెగాస్టార్‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. చిరు రెండేళ్ల వ‌ర‌కు ఇత‌ర ప‌నుల్లో బిజీగా ఉండి చ‌ర‌ణ్ సినిమా బాధ్య‌త‌లు కూడా అల్లు అర‌వింద్‌కే అప్ప‌గించాడ‌ట‌.

ఆ టైంలో చ‌ర‌ణ్‌తో సినిమాలు చేసేందుకు అర‌వింద్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే డైరెక్ట‌ర్లు చెప్పే క‌థ‌లు విన్నాక ఆ క‌థ న‌చ్చితే తానే బ‌న్నీ కోసం లాక్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ట‌. అలా చ‌ర‌ణ్ చేయాల్సిన రెండు సినిమాలు బ‌న్నీ చేసి హిట్ కొట్టాడు. అదే టైంలో చెర్రీకి వ‌రుస‌గా ప్లాపులు వ‌చ్చాయి. ఈ విష‌యం కాస్త లేటుగా చిరు వ‌ద్ద‌కు చేరింది. అప్ప‌టి నుంచి చెర్రీ సినిమాల‌తో పాటు కెరీర్ విష‌యంలో కాస్త కాన్సంట్రేష‌న్ చేయ‌డం స్టార్ట్ చేశాడు… మ‌నోడికి వ‌రుస‌గా హిట్లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత చెర్రీ సినిమాల కంట్రోల్ విష‌యంలో అర‌వింద్ జోక్యం త‌గ్గ‌డం.. ఇటు చిరు కంట్రోల్లోకి వెళ్లిపోవ‌డం… అర‌వింద్‌ను సైడ్ చేయ‌డంతో ఇలా ప్రారంభ‌మైన గ్యాప్ క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. ఇక ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత చిరుతో అర‌వింద్ ఓ సినిమా చేయాల‌నుకున్నా… వ‌రుస‌పెట్టి తండ్రి సినిమాలు చెర్రీయే నిర్మిస్తున్నాడు. ఇక బ‌న్నీ కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు ఇలా అన్ని క‌లిసి వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌కు కార‌ణ‌మైన‌ట్టుగా భోగ‌ట్టా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version