సుమ అడ్డాలో వాల్తేరు వీరయ్య.. పూనకాలు లోడింగ్

-

మెగాస్టార్​ చిరంజీవి సాధారణంగా షోలు హోస్ట్ చేయడమే కానీ బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. కేవలం ఇంటర్వ్యూలకే పరమితమైన చిరు.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేశాడు. ఈటీవీలో ప్రారంభమయ్యే సుమ అడ్డా సెలబ్రిటీ టాక్‌ షోకు చిరంజీవి గెస్టుగా వచ్చాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.

‘మాస్​ క్లాస్​ గ్రేస్​ కలిపితే భయ్యా వస్తున్నాడు మన వీరయ్య’ అంటూ యాంకర్​ సుమ చెప్పగానే ఫ్యాన్స్​ కేకలతో ఒక్కసారిగా స్టేజీ దద్దరిల్లింది​. అంతే వెంటనే బాస్​ స్టేజ్​ మీదకు వచ్చేశారు. దీంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. వాల్తేర్​ వీరయ్య సినిమా ప్రమోషన్స్​లో భాగంగా మూవీ యూనిట్​తో ‘సుమ అడ్డా’కు చిరు వచ్చారు. ‘డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌.. సుమ అడ్డా లోడింగ్‌’ అంటూ మెగాస్టార్‌ అనడం ప్రోమోలో హైలైట్​ పార్ట్​గా నిలిచింది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో చిరు జోష్​ చుసిన ఫ్యాన్స్​ ఇక ఎపిసోడ్​ ఎప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోపు ప్రోమో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version