క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్

-

డేవిడ్‌ వార్నర్ తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. క్రికెటర్‌గానే కాదు.. వార్నర్ ఓ టిక్‌టాకర్‌గా కూడా చాలా ఫేమస్. తెలుగు, హిందీ.. ఇలా భారతీయ సినిమాలకు సంబంధించిన పలు పాత్రలను అనుకరిస్తూ సోషల్‌ మీడియా వేదికగా రీల్స్‌ పెట్టి ఇక్కడి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. సూపర్ హిట్ సాంగ్స్‌కు తన కుటుంబంతో కలిసి స్టెప్పులేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటాడు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్ వార్నర్‌కు ఓ బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత తెలుగు సినిమాల్లో నటించాలని కోరింది. ‘‘ఆస్ట్రేలియా టాప్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత.. తెలుగు సినిమాల్లో నటించాలి. ఇదే అతడికి సరైన వేదికగా మేం భావిస్తున్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌ చేసింది.

దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్.. నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్‌ చేశాడు. ఇటీవల ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్న పుష్ప సినిమాలోని అల్లు అర్జున్‌ గెటప్‌తోపాటు డీజే టిల్లూగానూ డేవిడ్‌ వార్నర్ వేషధారణతో అభిమానుల మనసును కొల్లగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version