కేటీఆర్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా?

-

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ..  ‘‘కేటీఆర్, నేను బెంచ్‌మేట్స్. అదేంటి ఇద్దరి వయస్సులో చాలా తేడా ఉంది, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో అనుకోవద్దు. మేం అసెంబ్లీలో బెంచ్‌మేట్స్. నేను, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్లం. అప్పటి నుంచి నేను ఆయన్ని గమనిస్తున్నా… తక్కువ మాట్లాడేవారు. ఎంతో వినయంగా ఉండేవారు. ‘వినయ విధేయ రామ’ ఎవరో కాదు.. కేటీఆర్ అనిపించేది. అయితే, కేటీఆర్ నేను అనుకున్నంత ‘వినయ విధేయ రామ’ కాదు. ఆయన మాటల తూటాలతో ప్రత్యర్థులను తికమక పెట్టే డైనమిజం గల యువ నేత కేటీఆర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ పై ఏదైన బాధ్యత పెడితే అధిసాధించేవరకు ఆయన నిద్ర పోరన్నారు… ఇందుకు గతంలో జీహెచ్ఎంసీ ..ప్రస్తుత తెలంగాణ ఎన్నికలే నిదర్శనమంటూ పేర్కొన్నారు.

మనిషికి డబ్బు శాశ్వతం కాదు…కోట్ల రూపాయల కంటే కూడా అభిమానుల అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మనసుగెలుచుకుంటే దాన్ని ఎప్పుడూ కోల్పోం అన్నారు.


ఇన్నేళ్ల నా కెరీర్ లో ‘‘చిరంజీవి నువ్వు ఏం సాధించావు? అని ఎవరైన అడిగితే ఖచ్చితంగా .. చెప్పగలను. ఒకటి రామ్ చరణ్, రెండు కోట్లాది మంది అభిమానులు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలకు గతంలో కొద్ది గా గ్యాప్ ఇచ్చాను… ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాక అసలు నాపై ఉన్న అభిమానం ఎలా ఉందో అర్థమైంది. అయితే, ‘ఖైదీ నెం.150’ సినిమా తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మంచి హిట్‌తో నాపై ఉన్న అభిమానాన్ని చాటారు’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version