మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా స‌మావేశం

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా స‌మావేశ‌మ‌య్యారు.

వివిధ అంశాల‌పై కేటీఆర్, సంగ్మా చ‌ర్చించారు. సంగ్మా దంప‌తుల‌ను కేటీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

ఈ విషయాన్ని మేఘాలయ సీఎం సంగ్మా తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రియ మిత్రుడు కేటీఆర్‌ ను, ఆయన సతీమణిని హైదరాబాద్‌ లోని వారి నివాసంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. మేఘాలయ సీఎం కొన్రాడ్‌ సంగ్మా పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అయితే.. ఈ ట్వీట్‌ కు కేటీఆర్‌ కూడా రెస్పాండ్‌ అయ్యారు. డియర్‌ కొన్రాడ్‌ సంగ్మా మిమ్మల్ని ఎప్పుడూ కలిసినా సంతోషమే అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version