మేఘా కంపెనీ కాంట్రాక్టులను రద్దుచేసి సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలి – వైయస్ షర్మిల

-

పాలమూరు – రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో రేగమనగడ్డ వద్ద పంప్ హౌస్ ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్ లోకి దిగుతున్న సమయంలో ఒక్కసారి ఆ క్రేన్ వైరు తెగిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొక కార్మికునికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులందరూ బీహార్ కు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. మెగా కంపెనీ కాంట్రాక్టులను వెంటనే రద్దుచేసి సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు షర్మిల.

“సేఫ్టీ పాటించకుండా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ఐదుగురి ప్రాణాలను బలికొన్నది మేఘా కంపెనీ.ఈ చావుల బాధ్యత ఎవరిది? ఈప్రాణాల ఖరీదు ఎంత?ఇలాంటి ఎన్ని చావులను నోట్ల కట్టల కింద దాచిపెట్టారు? బయటకు రాని లోకానికి తెల్వని వార్తలెన్ని? దొరగారు అణిచిపెడుతున్న అక్రమాల ఆర్తనాదాలు ఎన్ని?ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమై, జనం సొమ్మును దోచుకుంటూ.. రక్షణ చర్యలు పాటించకుండా, నాసిరకం పనులు చేస్తూ, అడిగేవాడుండకూడదని అడ్డగోలుగా లంచాలు ఎరవేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మేఘా కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేసి సిబిఐ తో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version