టాలీవుడ్ కు ఈతరంలో పెద్దన్న లాగా అభిమానులు, యంగ్ హీరోలు అందరూ ఆదర్శంగా తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్నా సినిమాలపై మక్కువతో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న చిరు .. ఈ రోజు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు పదేళ్ల పాటుగా మెగా ఫోన్ పట్టని డైరెక్టర్ మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చాడు చిరంజీవి.. ఎందుకంటే కళామతల్లిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వారిలో చిరు ఒక్కరు. అందుకే మెహర్ రమేష్ ను నమ్మి ఇంతటి పోటీ ఉన్న పరిస్థితుల్లో అవకాశం ఇచ్చాడు. కానీ మెహర్ రమేష్ ఆ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవడంలో పూర్తిగా విఫలం అయినట్లు తెలుస్తోంది. తమిళ్ లో గతంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్, చెల్లెలి సెంటిమెంట్ తో తీసిన సినిమాలో రొటీన్ స్టోరీ, సాగదీత కథనంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడట మెహర్ రమేష్.
మెహర్ రమేష్ కు లైఫ్ ఇద్దామనుకున్న మెగాస్టార్ … కానీ మళ్ళీ పాత కథే !
-