ఆంధ్రా అయినా.. అమెరికా అయినా మనుషుల మధ్య బంధాలు ఒకేలా మారిపోయాయి. ఒకప్పుడు మనదగ్గర కుటుంబ సంబంధాలు చాలా పదిలమని పేరుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు.. అని పద్యాలు చదువుకుని మరీ బాధ్యతలను గుర్తించేవాళ్లం. అయితే, రాను రాను ఇది ఎటు దారితీసిందో తెలిసిందే. ప్రతి పట్టణం, నగరంలోనూ ఓల్డేజ్ హోంలు పెరిగిపోతున్నాయంటేనే బంధాల మధ్య బీటలు పడుతున్నాయనే కదా అర్ధం. ఇది పశ్చిమ దేశాల సంస్కృతి అని సరిపెట్టుకున్నాం. అయితే, అగ్రరాజ్యం అమెరికాను ఏలుతున్న ట్రంప్ కుటుంబంలోనూ పిల్లలకు సవితి పోరు ఇలానే ఉంది.
మన దగ్గర కూడా భార్య చనిపోయిన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నా.. భర్త చనిపోయిన మహిళ వేరే పురుషుడిని పెళ్లి చేసుకున్నా.. వారి వారి పిల్లలను ఎలా చూస్తారో తెలిసిందే. ఇప్పుడు అదే అగ్రరాజ్యంలోనూ కనిపిస్తోందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు తొలి భార్యకు విడాకులు ఇచ్చి..ను వివాహం చేసుకున్నారు. అయితే, ట్రంప్ తొలి భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకే ఇంట్లో ఉండకపోయినా.. కుమార్తె ఇవాంక మాత్రం తండ్రితో కలిసి అధ్యక్ష భవనంలోనే ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో భారత్ పర్యటనకు ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇవాంక ఆయన వెంట వచ్చారు.
అయితే, తండ్రితో ఉన్న సఖ్యత మారు తల్లి మెలాయినాతో ఇవాంకకు లేదని అమెరికా మీడియా చెబుతోంది. ఇటీవల రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్‌ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంక.. తన తండ్రిని, మారుతల్లి మెలానియాను నవ్వుతూ విష్ చేశారు. బదులుగా మెలానియా కూడా చిరునవ్వులు చిందించారు.
కానీ సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మూతి ముడుచుకున్నారు మెలానియా. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది వీక్షించారు. సో.. దీనిని బట్టి మారుతల్లి ఎక్కడైనా మారుతల్లే.. సవితి బిడ్డలు ఎక్కడైనా దూరమే!!
This was so weird. #RNC2020 pic.twitter.com/YHReTl0bfT
— Dana Goldberg (@DGComedy) August 28, 2020