పార్టీ మారిన వారి సభ్యత్వాలను ఆటోమేటిక్‌గా రద్దు చేయాలి: కూనంనేని

-

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిని ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. ఒక పార్టీలో గెలుపొంది మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని ఆటోమేటిక్‌గా రద్దు చేయాలన్నారు. ఒక పార్టీపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిన వారిని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏ ఎమ్మెల్యేకైనా సొంత పార్టీ నచ్చకపోతే..ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లాలని సూచించారు. లేనియెడల పార్టీలోకి ఆహ్వానించే వారు ముందుగా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలన్నారు. లేకపోతే నాయకులను నమ్మి ఓట్లేసిన ప్రజలు ఆగం కావాల్సి ఉంటుందన్నారు.ఇక ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను అత్యంత కిరాతకంగా చంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆటవిక యుద్ధానికి తెరలేపిందని కూనంనేని విమర్శించారు.ఈ హింసను వెంటనే ఆపేయాలని కోరారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news