బీడీ ప్యాకెట్‌లపై ​​రొనాల్డో, మెస్సీ… ఫోటోలు వైరల్‌

-

ప్రస్తుతం… జనరేషన్‌ లో మనం కొనే వస్తువులకు… స్టార్‌ హీరోలు, క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు… బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉంటున్నారు. వినియోగదారులు కూడా… వాళ్లను చూసే… కొంటున్నారు. అలాగే అలావాటు పడిపోయారు మరి. బూస్టు, బైక్స్‌, కార్లు, కూల్‌ డ్రింక్స్‌ ఇలా చాలా వాటికి స్టార్లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… తాజాగా పశ్చిమ బెంగాల్‌ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుట్‌ బాల్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ ఫోటోతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌ లోని ధూలియన్‌ లో ఆరిఫ్‌ బీడీ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను భారత ఐఏఎస్‌ అధికారి రూపీన్‌ శర్మ ”మెస్సీ ఫస్ట్‌ ఎండోర్స్‌ మెంట్‌ ఇన్‌ ఇండియా” అనే క్యాప్షన్‌ తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మెస్సీ ఏజెంట్లు దీన్ని చూడరని… బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్‌ చేయబోరని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. ”ఇది బెంగాల్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌ అయి ఉండాలి. ” అంటూ కామెంట్‌ చేశాడు. అయితే.. కేవల్ మెస్సీ ఫోటోతో ఉన్న బీడీ ప్యాకెట్‌ నే కాదు.. పోర్చుగ్రీస్‌ ఫుట్‌ బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో బీడీ ప్యాకెట్ల ఫోటోలు వైరల్‌ కావడం విశేషం.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news