BREAKING : భారత్-ఆసీస్ మ్యాచ్.. క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్…

-

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకంలో జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. వివాదాలన్నింటినీ పక్కనపెట్టేసియ 25న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ్యాచ్ జరిగే ీ నెల 25న క్రికెట్ ఫ్యాన్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు దాటనుంది. ఈ సమయంలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఇళ్లకు వెళ్లేందుకు నగరంలో ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రికెట్ ఫ్యాన్స్ రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version