టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ లో ప్రభాస్ చేలమండ దగ్గర గాయం అయింది. దీని వల్ల జపాన్ లో రిలీజ్ అయ్యే కల్కి సినిమా ప్రమోషన్స్ కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ తెలిపారు. గాయ నుంచి త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని కూడా ఆయన తెలిపారు.
జపాన్ లో జనవరి 03వ తేదీన కల్కి మూవీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ చేస్తే.. మంచి ఫలితం వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ తరుణంలోనే హీరో ప్రభాస్ కి గాయం కావడం గమనార్హం. గాయం కారణంగా జపాన్ వెళ్లలేకపోతున్నానని ప్రకటించారు ప్రభాస్. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.