వేములవాడలో మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

-

మిడ్ మానేరు నిర్వాసితుల ధర్నాతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వేములవాడ నంది కమాన్‌ వద్ద మధ్య మానేరు ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో మహాధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల నుంచి ముంపు బాధితులు వేములవాడకు వెళ్లేందుకు యత్నించగా నంది కమాన్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నా చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది నిర్వాసితులు పోలీసుల వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో డీఎస్పీలు నాగేంద్రాచారి, చంద్రశేఖర్‌, పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి తమకు పూర్తి స్థాయి పరిహారం అందలేదని, సీఎం ఇచ్చిన హామీ మేరకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదనే డిమాండ్లతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version