VIJAY DEVERAKONDA : ‘లైగర్’లో మైక్ టైసన్

-

హీరో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “లైగర్”. బాక్సింగ్‌ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్‌ పనిలో పడింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ లైగర్ సినిమా విడుదల తేదీని ఇవ్వాళ ప్రకటిస్తామని చెప్పిన చిత్రబృందం… విడుదల తేదీని కాకుండా… ఎవరూ ఊహించని అప్డేట్ ను మాత్రం ఇచ్చింది. ఈ సినిమాలో… రింగ్ మాస్టర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నట్లు పేర్కొంది చిత్రబృందం.

ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ ల మధ్య ఫైటింగ్ సీన్ ఉండబోతున్న ట్లు ఈ వీడియోలో చూపించింది చిత్రబృందం. ఇక ఈ అప్ డేట్ తో అ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మైక్ టైసన్ నటిస్తుండడంతో ఈ సినిమా ఓ రేంజ్ కు వెళుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమాను.. ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని చెప్పిన చిత్ర బృందం… త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version