వైఎస్ ఆస్తుల‌కు ఆ ఇద్ద‌రే వార‌సులు..రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం..!

-

వైటీపీ అధినేత్రి షర్మిల పై రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. సోదరి షర్మిల కు తండ్రి లేడు.. అన్న ఆదరణ కరువైందని రేవంత్ సెటైర్లు వేశారు. ఆడ కూతురు ఆవేదనలో ఏదో మాట్లాడుతుందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు మాట్లాడితే నేను స్పందిస్తా..ఎన్జీవో నడుపుకునే వారు మాట్లాడితే స్పందించవలసిన అవసరం లేదంటూ విమ‌ర్శ‌లు కురిపించారు. ఈ ప్రాంతం తో ష‌ర్మిల‌కు సంబంధం లేదు.

ఇక్కడి పరితీతులు ఆమెకు తెలువదంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్ షర్మిలే అనుమానం లేదని..కులపెద్దలో.. మతపెద్దలనో కోర్చోపెట్టుకుని ఆస్తుల పంచాయితీ తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి హిత‌వు ప‌లికారు. వైఎస్ ఆస్తులు మాకొద్దు మేము వారసులం కాదు..అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడని..రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ కోరుకున్నారని చెప్పారు. మోడీ ప్రధానిగా ఉండాలో రాహుల్ కావాలో ష‌ర్మిల చెప్పాల‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version