Breaking: మిలాద్ ఉన్ నబి యాత్ర వాయిదా!

-

ఈ నెల 28న గణేష్ నిమజ్జనం పోలీసులకు సవాలుగా మారింది. అదే రోజు మిలాద్ ఉన్ నబి ర్యాలీ ఉండడంతో.. రెండు యాత్రల నిర్వహణపై మతపెద్దలతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ వాయిదా వేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దానికి మత పెద్దలు అంగీకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని పోలీసులు కోరారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా.. రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో ఓ పీస్ కమిటీ (శాంతి కమిటీ) ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పీస్ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. రెండు పండుగలు ఒకే రోజు రావటంతో.. మిలాద్-ఉన్-నబీ ర్యాలీ వాయిదా వేసేందుకు పీస్ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. హిందూ భక్తులు విగ్రహాలు ప్రతిష్ఠించిన 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా.. గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version