ఖుషి’ టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

-

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ‘మీరు ఆరాధ్య, విప్లవ్లను చూస్తూ ఉండిపోతారు’ అని పేర్కొంటూ మేకర్స్ వీడియోను ట్వీట్ చేశారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ ఈనెల 1న రిలీజ్ అవ్వగా.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటె, ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి. కానీ సినిమా సేఫ్ జోన్ లో ఉండాలంటే అది చాలదు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సోమవారం నాడు తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలెక్షన్లు పడిపోయాయి. ఖుషీ నైజాంలో గొప్పగా బిజినెస్ సాగిస్తున్నా, వర్షాలు ఆ ఫ్లో ను పాడు చేశాయి. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే రెండు భారీ చిత్రాలు రేపు విడుదలై కలెక్షన్లు డివైడ్ అవుతుండడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ వారం ఖుషీ ఎంత వసూళ్లు రాబదుతుందో చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా నటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version