దేశంలో పాల ఉత్పత్తి 198.4 మిలియన్ టన్నులకు చేరుకుంది

-

భారతదేశ పాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 35.61% పెరిగి 2019-20లో 198.4 మిలియన్ టన్నులకు చేరుకుందని,  దేశంలో పాల ఉత్పత్తి 2014-15లో 146.3 మిలియన్ టన్నుల నుండి 2020-21 నాటికి 198.4 మిలియన్ టన్నులకు పెరిగింది” అని ఎన్‌డిడిబి సర్వే తెలిపింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా  5.70 శాతం పెరిగింది. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్  (ఎన్‌డిడిబి)నిర్వహించిన పాల డిమాండ్‌పై చేసిన అధ్యయనం ప్రకారం , 2030 నాటికి అఖిల భారత స్థాయిలో పాలు మరియు పాల ఉత్పత్తులకు 266.5 మిలియన్ మెట్రిక్ టన్నుల డిమాండ్ అంచనా వేయబడింది.

మొత్తం వినియోగంలో గ్రామీణ రంగం వాటా 57 శాతంగా అంచనా వేయబడింది. 2030 అంచనాలలో కూడా పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగం (592 ml) గ్రామీణ ప్రాంతాల (404 ml) కంటే ఎక్కువగా ఉంది.

పశువుల ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దీని ఫలితంగా పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్‌ కొనసాగుతోంది.

2014-15లో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 6.27 శాతంగా ఉంది, ఆ తర్వాత స్థిరమైన పెరుగుదల ఉంది. 2020-21 లో పాల ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 5.68 శాతం పెరిగింది.
2020-21 లో తలసరి పాల లభ్యత రోజుకు 407 గ్రాములు అని ఈ సర్వే పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version