పవన్ కళ్యాణ్ పై ఎంఐఎం పోలీసులకు ఫిర్యాదు

-

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పవన్‌పై ఏఐఎంఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారని అవమానించినందుకు.. పవన్‌ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌లో కొందరు నేతలు.. పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామంటారు. మనకు అలాంటి ప్రభుత్వాలు వద్దు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా? కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ నాందేడ్‌ జిల్లా దెగ్లూరులలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version