ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి విడదల రజిని ప్రశంసలు కురిపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు లో 95% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి దేనని ఆమె కొనియాడారు. పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల వర్గాలకు ఈ పథకాల వల్ల మేలు జరుగుతోందని అన్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది అని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామున ఐదున్నరకే లబ్ధిదారులకు పింఛను ఇచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ. 700 కోట్లు లబ్ధిదారులకు చేరాయని చెప్పారు మంత్రి.