మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా.. సెక్షన్ 144 అమలు!

-

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం శనివారం సమావేశం అయింది. ఈ సమావేశానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి ముందు పుణేలోని ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఇల్లును శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ముంబైలో సెక్షన్ 144ను విధించారు. అలాగే షిండే ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మహారాష్ట్ర-సెక్షన్ 144

మహారాష్ట్రలోని గౌహతిలో షిండే ఆధ్వర్యంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం సమావేశం అయింది. శివసేనకు చెందిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు క్యాంపులో ఉన్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం ముగిశాక ఏక్‌నాథ్ షిండే 38 మంది ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశారు. అయితే మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వాన్ని కూల్చేందుకు షిండేకు కేవలం 37 ఎమ్మెల్యేలు అవసరం. కానీ షిండేకు ఎమ్మెల్యే మద్దతు ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version