రెవెన్యూ గ్రీవెన్సులే ఎప్పుడైనా అధికంగా వస్తాయి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ గ్రీవెన్సుల పైన కఠినతరమైన విధానాలు అవలంబిస్తున్నాం. గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాం. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా భూములను గుర్తిస్తాం. పది జిల్లాల్లో 50 నుంచీ 60 అభ్యంతరాలు వచ్చాయి. కమిటీ సిఫారసులు, గ్రోత్ కారిడార్ల అధ్యయనం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉంటుంది. 200 మంది దాకా డిజిటల్ అసిస్టెంట్ లను రిజిస్ట్రేషన్ విధానంలో వినియోగిస్తాం. ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతీ చోటా ఉండేలా చూస్తాం.
ఇప్పటికే 6200 కోట్లు రెవెన్యూ శాఖలో ఆదాయం ఉంది… మార్చి నాటికి 10వేల కోట్లు దాటే అవకాశం ఉంది. ఇప్పటికీ 120 కోట్ల వరకూ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. ఇక కరెంటు ఛార్జీలు పెరగడం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు. 22.4 మిలియన్ యూనిట్ల మిగులును నాశనం చేశారు. సెప్టెంబర్ నెల తప్ప మిగిలిన నెలల్లో ఎక్కువగానే రిజిస్ట్రేషన్ లు జరిగాయి… రీసర్వే వల్ల వచ్చిన నష్టాల పైన కూడా చర్యలు తీసుకుంటాం. 198 కోట్లు రీసర్వే ఇన్సెంటివ్ వచ్చింది.. సబ్ రిజిష్ట్రార్, ఎంఆర్ఓ కార్యాలయాల పునరుద్ధరణకు వినియోగిస్తాం అని మంత్రి అనగాని పేర్కొన్నారు.