ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు కూడా తీసుకొస్తున్నాం : మంత్రి అనగాని

-

రెవెన్యూ సదస్సులపై ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కేబినెట్ లో కూడా ఎక్కువసేపు రెవెన్యూ సదస్సులపై చర్చ జరిగింది. 32 రకాల గ్రీవెన్సులు సదస్సులలో వస్తున్నాయి. 22a కింద 1.88 కోట్ల ఎకరాలున్నాయి. సత్వర పరిష్కారం ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనుంది. రైల్వే ట్రాక్ లు ఎండోమెంట్ భూములలోంచీ వెడితే గత ప్రభుత్వంలో ఆ పరిహారాలు అప్పటి ఎంఎల్ఏల కుటుంబ సభ్యులకు వెళ్ళాయి.

ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు కూడా తీసుకొస్తున్నాం. ఈనెల 20 నాటికి పూర్తిగా అన్ని సదస్సులు పూర్తవ్వాలి. ఆడిట్ కూడా చేస్తున్నాం… పరిష్కారం కాకుండా అయ్యాయని అధికారులు నమోదు చేస్తే చర్యలుంటాయి. భూముల మార్కెట్ విలువల పెంపు అభివృద్ధి ప్రాతిపదికన చేస్తున్నాం. డీమ్డ్ టూ బీ అప్రూవ్డ్ అని వస్తే సదరు ఎంఆర్ఓ బాధ్యులవుతారు. 1.05 వేల మందికి పాస్ బుక్కులు ఇచ్చాం… ఇంకా 7 వేల మందికి ఇవ్వాలి. మిగతా పాస్ బుక్కులు కూడా ఇస్తాం. ఈనెల 20 నుంచి రోజుకు 20 ఎకరాలు రీసర్వే చేసేలా.. మండలానికి ఒక గ్రామానికి రీసర్వే చేసేలా ప్రణాళిక సిద్ధం చేసాం. గత ప్రభుత్వ రీసర్వే మూలంగా పలు ఇబ్బందులు వచ్చాయి అని మంత్రి అనగాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version