ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు దీని బారిన పడగా.. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. మొదట నెగెటివ్ రాగా మంగళవారం సాయంత్రం పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు.
ఇక అలాగే అదే జిల్లాకు చెందిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన కూడా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేరారు. అలాగే ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, ఇందులో కొందరు కొలుకొని బయట పగడా.. మరికొందరు చికిత్స పొందుతున్నారు.