నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు వరుసగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రకమైన కామెంట్స్ పైనే హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఇక పై ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది హై కమాండ్. ఎవరూ కూడా మీడియా ముందు ఈ కరమైన బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసిన హై కమాండ్.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ పై రుద్దవద్దని తేల్చి చెప్పింది.
కానీ ఈ విషయంలో మంత్రి టిజి భరత్ హై కమాండ్ ఆదేశాలను పాటించుకోలేదు. లోకేష్ డిప్యూటీ సీఎం అని బయట ఎవరు మాట్లాడద్దు అని ఆదేశాలు ఇస్తే.. లోకేష్ సీఎం అవ్వాలి అని పేర్కొన్నారు మంత్రి భరత్. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మంత్రి నారా లోకేష్ లతో ఉన్న టిజి భరత్ అక్కడ పాల్గొన ఓ కార్యక్రమంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ది పార్టీ అని భరత్ పేర్కొన్నారు.