ఏపీ అప్పులకి కారణం చంద్రబాబు: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

-

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల్లో రాష్ట్రము ఉండడానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపిఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశామని వ్యాఖ్యలు చేసారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రి చంద్ర బాబు ఏ ఆధారంతో ఈ లెక్కలు చెప్తున్నారు..?

ఇంకొకరు 10లక్షల కోట్లు అంటారు మరొకసారి ఏడు లక్షల కోట్లు అంటారు ఈ లెక్కలు ఎవరిచ్చారు అని అడిగారు. బుగ్గన మాట్లాడుతూ కోవిడ్ వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగిందని పెండింగ్ బిల్స్ 1,90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు అని అడిగారు ఆర్బిఐ విడుదల చేసిన డాక్యుమెంట్ లో 15 ఏళ్ల డేటా ఉంటుంది టిడిపి హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే ఈ ప్రభుత్వంలో 12 శాతమే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news