వేడినీళ్లు తాగితే క‌రోనా పోతుంది.. మంత్రి ఎర్ర‌బెల్లి వ్యాఖ్య‌లు.. వైర‌ల్ వీడియో..!

-

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇంకా మ‌న దేశంలోకి రాక‌ముందు ప‌లువురు నేత‌లు ఆ వైర‌స్‌పై తెలిసీ తెలియ‌ని వ్యాఖ్య‌లు చేసి.. ఆ త‌రువాత నాలుక క‌రుచుకున్నారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి వేరే. మ‌న‌కు క‌రోనా ఎలా వ‌స్తుంది.. ఎలా వ్యాప్తి చెందుతుంది.. దాని ల‌క్ష‌ణాలు, చికిత్స ఏమిటి ? అన్న వివ‌రాలు దాదాపుగా అంద‌రికీ తెలుసు. కానీ కొంద‌రు నేత‌లు మాత్రం ఇంకా ఏమీ తెలియ‌న‌ట్లు మాట్లాడుతూ అన‌వ‌స‌రంగా అభాసుపాల‌వుతున్నారు. అందుకు మంత్రి ఎర్ర‌బెల్లి క‌రోనాపై మాట్లాడిన మాట‌లే తాజా ఉదాహ‌ర‌ణ‌.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌తో నిర్వ‌హించిన ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ గొంతులో ఉంటుంద‌ని.. వేడి నీళ్లు తాగితే పోతుంద‌ని.. అక్క‌డి నుంచి ఆ వైర‌స్ క‌డుపులోకి వెళ్తుంద‌ని.. దాంతో అది కింద‌కు వెళ్తుంద‌ని.. అన్నారు. మ‌న క‌డుపు ఓ మ‌హాయంత్ర‌మ‌ని, బొక్క‌ల‌ను కూడా అరిగించుకుంటుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. కాగా ప‌లువురు అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంల‌నే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక మంత్రి ఎర్ర‌బెల్లికి చెందిన ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆ మంత్రి ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version