అభివృద్ధి, సంక్షేమాలు య‌జ్ఞంలా కొనసాగుతూనే ఉంటుంది : మంత్రి ఎర్రబెల్లి

-

హనుమకొండ జిల్లా కేశవపూర్‌లో రైతు వేదికను మంత్రి సత్యవతి రాథోడ్‌ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు య‌జ్ఞంలా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దండేపల్లిలో ఆయిల్ ఫామ్‌సాగుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేశారు. అలాగే కోతుల న‌డుమ గ్రామంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం గ‌ట్ల న‌ర్సింగాపూర్ లో పంచాయ‌తీరాజ్ రోడ్లకు శంకుస్థాప‌న చేశారు. అట్లాగే రైతు వేదిక‌ను ప్రారంభించారు. అనంత‌రం ఎల్కతుర్తి మండ‌లం దామెర‌లో 133/11 కేవీ స‌బ్ స్టేష‌న్‌ను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అన‌తి కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింద‌న్నారు.

రైతుల కోసం కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు, 24 గంటల పాటు ఉచితంగా న్యాయమైన కోతలు లేని కరెంటు ఇస్తున్నామన్నారు. విత్తనాలు, రుణమాఫీ, రైతుబీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్‌ పథకాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని, ప్రధాని మోదీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. వీటిని ప్రజలు గమనించాలన్నారు. రైతులను లాభదాయక వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. అందుకే ఆయిల్ పామ్ పంట‌ల‌ను బాగా వేయాల‌ని, ఇందుకు స‌బ్సిడీని ఇస్తూ, డ్రిప్ ఇరిగేష‌న్‌ను కూడా అంద‌చేస్తున్నామ‌ని వివ‌రించారు మంత్రి ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version