దేశంలోనే ఇది మొదటి ఒప్పందం : మంత్రి ఎర్రబెల్లి

-

మ‌ర్రి చెన్నారెడ్డి మావ‌న వ‌న‌రుల అభివృద్ధి కేంద్రం స్వ‌యం స‌హాయ‌క సంఘాల ఉత్ప‌త్తిదారుల కంపెనీల‌తో ఫ్లిక్ కార్ట్ ఒప్పంద కార్యక్రమం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగింది. అయితే ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మల్టీ నేషనల్ కంపెనీ, స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం పట్ల శుభాకాంక్ష‌లు.. అభినందనలు తెలిపారు. దేశంలోనే ఇది మొదటి ఒప్పందమని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిందని, ఫ్లిప్ కార్డ్ కి ఒక క్రెడిట్ ఉందని, వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నీళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చింది.

దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారిందని, వ్య‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు ప‌చ్చ‌గా ఉన్నాయన్నారు. సాగు దిగుబ‌డి పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. మ‌న మ‌హిళా సంఘాల‌కు దేశంలోనే మంచి పేరుందని, సాగు, వ్య‌వ‌సాయోత్ప‌త్తులు, ఇత‌ర ఉత్ప‌త్తుల రంగంలోకి మ‌హిళ‌లు వ‌చ్చారన్నారు. మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడిందని, మ‌హిళ‌లు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారన్నారు. మహిళా సంఘాలు మన తెలంగాణ లో ఉండటం, నేను ఆ శాఖకు మంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version