లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కరోనాతో జీవించాల్సిందే.. ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు

-

కరోనా కేసులకు సంబంధించి మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయని ఆయన అన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కేసుల సంఖ్య పెరిగినా… వైరస్ తీవ్రత తగ్గుతుందన్న ఆయన ప్రైవేటు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యామని అన్నారు. బెడ్స్ అందుబాటులో ఉంచాలని కోరామన్న ఆయన బహిరంగ సభలకు వెళ్లకూడదు, అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అన్నారు.

లాక్ డౌన్ ప్రసక్తే లేదు, సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని అయన అన్నారు. కరోనాతో జీవించాల్సిందే అందుకే ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని అన్నారు. టీకాలు, ట్రీట్ మెంట్ ప్రతి జిల్లాలో అందుబాటులో ఉందని, తెలంగాణ లో ప్రస్తుతం వాక్సిన్ కొరత లేదు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ సరఫరా సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version