ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పెరిగాయి : మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కంపై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మంత్రి హ‌రీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. 2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467 సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయ‌ని చెప్పారు. 2021-22లో ఆరోగ్య శ్రీ సర్జరీలు 43 ( 1,52,096 సర్జరీలు) శాతానికి పెంచగలిగామ‌ని తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఈ ఏడాది ఆగష్టు 31 నాటికే 1,14,681 సర్జరీలు (53 శాతం) జరిగాయ‌ని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2020-21లో 34 శాతం ఉన్నఆరోగ్య శ్రీ సర్జరీలు ఉంటే, దాన్ని 53 శాతానికి పెంచ‌గ‌లిగామ‌ని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు‌ చేయడం, ఎంఆర్ఐ స్కాన్ , సిటీ‌ స్కాన్, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పెరిగాయ‌న్నారు మంత్రి హరీశ్ రావు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలలో కూడా ఆరోగ్య శ్రీ సేవలు అందించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఆరోగ్య శ్రీ సేవలు, సర్జరీలు పెరిగాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version