తెలంగాణాలో సైతం మూడు రోజులు భారీ వర్షాలు

-

ఈ ఏడాది తెలంగాణాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్త‌ర భార‌తం నుంచి తిరోగ‌మ‌న దారిలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌పై నుంచి చురుగ్గా క‌దులుతున్నాయి. దీనికి తోడు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున స్థిరంగా కొన‌సాగుతోంది. దీని ప్ర‌భావంతో ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు రోజులు పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

బుధవారం రాష్ట్రంలో కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version