అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పది : హరీష్ రావు

-

నేడు వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. నలుగురు ఎమ్మెల్యేలు బ్లడ్ క్యాంపు నిర్వహణలో యాక్టవ్‌గా ఉన్నారని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారని, ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారన్నారు.

ఆపదలో ఉన్న వారికి రక్తం అందిస్తున్న ఎమ్మెల్యేలను సన్మానిస్తున్నామని, రక్తదానం విషయంలో అపోహలు వద్దన్నారు మంత్రి హరీష్‌ రావు. రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది,అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాక ముందు 28 బ్లడ్ బ్యాంకులు ఉండేవి, ఇప్పుడు 56 బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా పని చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ సెపరేట్ మెషీన్స్ ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్ కే ఎక్కువగా రక్తం అందించండని ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version