బీజేపీకి ఓటేస్తే.. వాతలు, కోతలే : హరీష్ రావు ఫైర్

-

బీజేపీ పార్టీకి ఓటేస్తే.. ధరలు పెంచి వాతలు… సబ్సిడీల్లో కోతలు పెడుతుందని ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌ రావు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా కందుగుల గ్రామంలో ఇవాళ మంత్రి హరీశ్ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని.. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థం వల్ల వచ్చిందని మండిపడ్డారు. హుజూరాబాద్ జిల్లా కావాలని, లేదా హుజూరాబాద్ కు మెడికల్ కాలేజి కావాలని రాజీనామా చేశారా.. ? స్వలాభం కోసం ఈటల రాజీనామా చేశారని నిప్పులు చెరిగారు.

వ్యక్తి లాభం ముఖ్యమా….వ్యవస్థ లాభం ముఖ్యమా..? అని… ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలో ‌చేరారని… బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని నిలదీశారు. గ్యాస్‌ సిలిండర్ ధర పెంచి ప్రజలకు బీజేపీ వాతలు పెడుతోందని ఫైర్‌ అయ్యారు. గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.15 పెంచారని… వారం వారం బీజేపీ గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా.. ? సంక్షేమ పథకాలు అమలు చేసే టీఆర్‌ఎస్‌ కు ఓటు వేద్దామా అని తెలిపారు. గెల్లు శ్రీనుకు ఓటేస్తే.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు వస్తాయని హామీ ఇచ్చారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version