బిజెపికి ఓటు వేయండి.. మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

-

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావలసిన బిల్లులు జాప్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శించారు. ఇకనైనా తెలంగాణకు రావాల్సిన బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు హరిస్తుంది.

రాష్ట్రంలోని రైతులందరూ ఒకవేళ మీటర్లు కావాలి అనుకుంటే బిజెపి పార్టీకి ఓటు వేయాలి తెలిపిన హరీష్ రావు.. మీటర్లు వద్దనుకుంటే మాత్రం కారు గుర్తుకు ఓటు వేయాలి అంటూ సూచించారు. తెలంగాణా ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి రైతుల అభ్యున్నతికి పాటు పడుతుంటే.. కేంద్రం వ్యవసాయ బిల్లుతో రైతులకు అన్యాయం చేసేందుకు సిద్ధమైంది అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version