తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు : * జగదీశ్ రెడ్డి*

తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదని ప్రకటన చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే అది కేంద్ర ప్రభుత్వనీదే బాధ్యత అవుతుందని.. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు. కేంద్ర నిర్ణయాలతో విద్యుత్ సమస్యలు భవిష్యత్ లో ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్రాల పై లేని పెత్తనం చేలాయించాలని కేంద్రం భావిస్తోందని మండి పడ్డారు.

కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి విద్యుత్ ఇప్పటి వరకు లేదన్నారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పై వస్తున్న వార్తలు అర్థ రహితమని.. ఒక్క నిమిషం కూడా తెలంగాణలో పవర్ కట్ అవదన్నారు.

రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణ లో ఉన్నాయని.. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసామని స్పష్టం చేశారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుందన్నారు. శ్రీశైలం, సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి..