Anasuya Bharadwaj: మ‌రోసారి అందాల ఆరాబోత‌కు సిద్ద‌మ‌వుతున్న రంగ‌మ్మ‌త్త‌!

Anasuya Bharadwaj: బుల్లితెరపై ఓ సంచలనం అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).
ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ.. తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌. ఓవైపు.. త‌న హాట్ యాంక‌రింగ్ తో బుల్లి తెర‌ ప్రేక్షకులను అలరిస్తూనే.. వీలున్నప్పుడల్లా వెండితెర‌పై కూడా అందాలను ఆరాబోస్తుంది. త‌న స‌త్తాతో వరుసగా ఆఫర్లు కైవ‌సం చేసుకుంటుంది.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో.. రంగమ్మాత్త పాత్రలో ఒదిగిపోయింది. త‌న నటనతో ప్రేక్షకుల ఫిదా చేసింది. ఈ సినిమాతో అన‌సూయ స్టార్ తిరిగింది. పలు చిత్రాల్లో కీలక పాత్రలలో నటించడమే కాదు.. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‏లోనూ దూసుకుపోతుంది.

తాజాగా అందాల యాంక‌ర‌మ్మ అనసూయ మరో స్పెషల్ సాంగ్ సిద్ద‌మ‌వుతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లుగా ఇండ‌స్ట్రీ టాక్. అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.