కేసీఆర్కు భయపడే మునుగోడు నోటిఫికేషన్ : జగదీష్ రెడ్డి

-

ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే.. కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన తేల్చిచెప్పారు. ఎవరెన్ని కుట్రలకు తెర లేపినా అంతిమ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఢిల్లీ బాద్‌షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వింటేనే హడలిపోతున్నారన్నారు జగదీష్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ అధికారికంగా ప్రకటించారో లేదో 24 గంటల్లోనే మునుగోడు ప్రకటన వెలువడిందని తెలిపారు జగదీష్ రెడ్డి.

వాస్తవానికి అమిత్ షా మునుగోడు పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎన్నికల ప్రకటన వస్తుందని భావించామన్నారు. అయితే పరిస్థితులు బీజేపీకి ఆశాజనకంగా కనిపించక పోయేసరికి వాయిదాల పద్ధతిని ఎంచుకున్నట్లు కనిపించిందన్నారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే అక్కడి ప్రజలు టీఆర్ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించారన్నారు. ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా లు అడ్డుపడ్డా.. నడ్డా వచ్చి ఇక్కడే అడ్డా వేసినా గులాబీ గెలుపును ఆపడం వారి తరం కాదన్నారు. జాతీయ పార్టీ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తి పోతున్నారని ఆయన చెప్పారు జగదీష్ రెడ్డి. రాత్రికి రాత్రే వచ్చిన మునుగోడు ఎన్నికల ప్రకటన అందులో భాగమేనన్నారు. మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని, ఇప్పటికీ మాతో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చిచెప్పారు జగదీష్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version