మరోసారి టీడీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతు భరోసా విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై బురద చల్లడమే టీడీపీ ప్రధాన ఎజెండా అని, విత్తనాలపై అవగాహన లేక అనవసర ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండి వ్యవసాయంపై అవగాహన లేని వారు వ్యవసాయంపై మాట్లాడుతున్నారన్నారు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా బురద చల్లుతున్నారన్నారు. టీడీపీకి మొత్తం అల్జీమర్స్ వచ్చిందా..? అని ఆయన ప్రశ్నించారు.
రుణమాఫీ విషయంలో టీడీపీ మోసం చేయలేదా..? గత పాలనను టీడీపీ మర్చిపోయిందా..? జీవోలు ఇవ్వడం తప్ప.. అమలు చేసిన చరిత్ర టీడీపీకుందా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో స్టేషనరీ దండుగ వ్యవహారాలే జరిగాయని, బుద్దున్న వాడు ఎవడైనా చెప్పు చూపిస్తారా..? అని ఆయన ధ్వజమెత్తారు. సందేశమివ్వాల్సిన నాయకుడు చెప్పులు చూపిస్తారా..? తన ప్యాకేజీ బాగోతం బయటపడిందనే పవన్ చెప్పు చూపించారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలన్న నోటితోనే అమరావతిలోనే రాజధాని అని పవన్ ఎలా అంటారు. చెప్పు చూపించడం ద్వారా పవన్ తన చెప్పుతో తానే కొట్టుకున్నట్టు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.