యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి ప్రముఖలు, సామాన్య ప్రజలు, దేశంలోని సినీ, పొలిటికల్ లీడర్లు సైతం హాజరై త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు.
అక్కడి ఘాట్స్‌లో గంగా,యమునా నదులకు ప్రత్యేక పూజలు చేసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆయన ప్రార్థించారు.వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామికి మొక్కులు సమర్పించారు.ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేడు యూపీ సీఎం యోగి, ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము సైతం మహాకుంభమేళాకు హాజరయ్యారు.