కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ ,రామ్మోహన్ నాయుడుని కలిశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు,జాతీయ రహదారులు,ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరాం.. రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు అని ఆయన అన్నారు.
అలాగే 95 శాతం భూసేకరణ పూర్తయింది..కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తాం. హైదారాబాద్ విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరాం. రెండు ప్యాకేజీలు గా రోడ్డు నిర్మాణం జరిపేందుకు టెండర్లు పిలిచేందుకు అధికారులు గడ్కరీ ఆదేశాలిచ్చారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్ ను వేగవంతం చేయాలని కోరాం. అటవీ భూములు,అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని అధికారులకు గడ్కరీ సూచించారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచెందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు అని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు.