టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన గతంలో ప్రస్తుత సీం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం విధితమే. ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. మరోవైపు నరసరావు పేట పోలీస్ స్టేషన్ కు కూడా తీసుకెళ్లి విచారణ జరిపారు.
ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదవ్వడం గమనార్హం. తాజాగా కర్నూల్ JFCM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదోని కేసు కు సంబంధించి న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చింది. ఇప్పటి వరకు మూడు కేసుల్లో పోసాని కి బెయిల్ మంజూరు అయింది.