పరిసరాల పరిశుభ్రతపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మంచి వాతావరణం కలిగి ఉండడానికి సహాయపడుతుంది. నల్లగొండ పట్టణంలోని ఎన్.జీ.కాలేజీ కంపౌండ్ వాల్ పక్కన స్థానికలు చెత్తవేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్తమయంగా తయారయ్యాయి.
ఈ ప్రాంతంలో వెంటనే డ్రైనేజీ పై వాల్స్ నిర్మించి..చెత్తనిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించడం జరిగింది.ప్రజలకు కూడా నా విజ్ఞప్తి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం బాధ్యత గల పౌరుడుగా నడుచుకుందాం’ అని రాసుకొచ్చారు.