రాహుల్ గాంధీ పాదయాత్ర లోనే చెప్పారు.. కుల గణన చేస్తాం అని. కానీ శాసన సభలో ఏం చెప్పకుండా.. ఆమోదించము అంటే అర్ధం ఏంటి అని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. మేము బీసీ లకు ఎన్ని పదవులు ఇస్తే.. వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని BRSది బాధ. ఇక నిజంగానే BRS సర్వే చేస్తే.. శాసనసభలో ఎందుకు పెట్టలేదు. సర్వే ప్రకారం మీరు బీసీలకు పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రు.
అయితే ఈ నివేదిక అమలు కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కాబట్టి Bc నేతలు అప్రమత్తంగా ఉండండి. పొరపాట్లు ఉంటే.. తీసుకురండి. అంతే కానీ నివేదిక తప్పు అని చెప్పి.. బీసీ లను అన్యాయం చేయకండి. మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దు. బీసీ నేతలు ఆలోచించండి. నేను బీసీ బిడ్డగా అప్పీల్ చేస్తున్న.. బీసీ సంఘాల నేతలు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు. సర్వే లో తప్పులు ఉంటే మాకు చెప్పండి.. సరిదిద్దుతం అని కొండా సురేఖ పేర్కొన్నారు.