పార్టీలో ఎవరైనా క్రమశిక్షణకి లోబడి ఉండాల్సిందే : టీపీసీసీ చీఫ్

-

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పార్టీ లో చిన్న వాడు అయినా…పెద్ద వాడైనా క్రమశిక్షణ కి లోబడి ఉండాల్సిందే. రాష్ట్ర జనాభా ఇది అని కేంద్రానికి ఇచ్చాము. పరిష్కారం చూపాల్సిన బాధ్యత బీజేపీకి లేదా.. కాంగ్రెస్ కి కమిట్ మెంట్ ఉంది కాబట్టి.. నేను టీపీసీసీ చీఫ్ అయ్యను. రిజర్వేషన్ పెంచే ఆలోచనతోనే కుల గణన జరిగింది. పీసీసీ కమిటీలో 50 శాతం sc, st, bcలకే అని మహేష్ గౌడ్ తెలిపారు.

ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీహార్ లో సర్వే చేసి నివేదిక ఇవ్వలేదు. మేము ఏడాది లో చేసిన సర్వే .. నివేదిక బయటకు ఇచ్చాం. బయట మమ్మల్ని అడుగుతున్న వాళ్ళు బీసీ బిడ్డలే. వేరే వాళ్ళ ట్రాప్ లో పడకుండా… పొరపాట్లు ఉంటే చెప్పండి.. సరిదిద్దుతం. ఎవడో కాకి లెక్కలు చెప్తే నమ్ముతారా. Bc సంఘాల నేతలు వస్తె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మేధావులు… ఈ అంశానికి అన్యాయం చేసే పని చేయకండి. మేము bc ఉద్యమాలు చేసిన వాళ్ళం. మాకు మా వర్గాలకు న్యాయం చేయాలని ఉండదా.. పదేళ్లు అధికారంలో ఉండి ఎంత బీసీ లకు న్యాయం చేశారు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version