మీరు కరుణిస్తే గెలుస్తా.. లేకుంటా ఇంట్లో ఉంటా : మంత్రి కేటీఆర్‌

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలో బీసీ, ఎంబీసీ కుల వృత్తులకు రూ.లక్ష గ్రాంట్ రూపంలో 600 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తాను… ఓట్ల కోసం మాత్రం మందు పోయానని, పైసలు పంచనని కేటీఆర్ అన్నారు.

గతంలోను ఇలా చేయలేదన్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం… ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటానన్నారు. ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పి వారిని నిలదీయాలన్నారు. ప్రతిపక్షాలు తమకు సలహాలు ఇస్తేనే పెన్షన్ పెంచలేదన్నారు. ఇప్పుడు ఆరువందల మందికి పెన్షన్ ఇస్తే వార్త కాదని, కానీ ఆరుగురికి రాకుంటే వార్త అవుతోందన్నారు. తెలంగాణలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా తొమ్మిది రకాల పథకాలను అమల్లోకి తెచ్చామన్నారు. బీసీ బంధు అంటే లోన్ కాదని, ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ అన్నారు. దీనిని తిరిగి కట్టవలసిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version