తమిళ్ హీరో విశాల్ గతంలో అనీషా రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాక వివిధ కారణాల వలన పెళ్లి పీతల వరకు అది వెళ్లకుండానే పెటాకులు అయింది. అప్పటి నుండి విశాల్ అసలు పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ విశాల్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయట. కెరీర్ పై పూర్తి దృష్టిని కేంద్రీకరించిన విశాల్ ఒకమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఈమె తనతో ఇంతకు ముందు రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా చేసిన అమ్మాయి కావడం మరో విశేషం. పల్నాడు, ఇంద్రుడు సినిమాలలో ఇద్దరూ కలిసి నటించారు, ఇందులో కలిసి నటించిన లక్ష్మి మీనన్ ను తాను పెళ్లాడనున్నాడు. కాగా నిశ్చితార్థం ఎప్పుడు ? పెళ్లి ఎప్పుడు ? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.