రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పిస్తునే మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశ పెడుతున్న పథకాలు.. చేపడుతున్న కార్యక్రమాల సమాచారం అందిస్తుంటారు. అప్పుడప్పుడు తన దృష్టికి వచ్చిన ఫొటో లు కూడా షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా అభివృద్ధి పనులకు సంబంధించి.. బిఫోర్.. ఆఫ్టర్ ఫొటోలు ఎక్కువగా షేర్ చేస్తారు. తాజాగా అలాంటి ఒక ఫోటో షేర్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సచివాలయం భవనానికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్విటర్ అంకౌంట్ ద్వారా పంచుకున్నారు. తుది దశలో ఉన్న సచివాలయం, అమరవీరుల స్మారకం చిత్రాన్ని “గ్లోరియస్ వ్యూ ఆఫ్ హైదరాబాద్” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయంత్రం వేళ సన్సెట్ అవుతున్న గోల్డెన్ అవర్ లో తీసిన ఈ ఫోటో ఎంతో అందంగా ఉంది.
సూర్యుని కాంతి ఓ వైపు.. విద్యుత్ దీపాలతో మరోవైపు వెలుగుతున్న రెండు ప్రతిష్టాత్మక నిర్మాణాల చిత్రాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిత్రంలో ప్రత్యేకించి అమరవీరల స్మారకం స్టెయిన్ లెస్ స్టీల్ క్లాడింగ్‌పై సూర్యుని కాంతి వెలుగుల్లో మేఘాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల స్మారకం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Glorious view of Hyderabad ❤️
The soon to be unveiled Telangana Martyrs’ Memorial & Dr. B. R. Ambedkar State Secretariat seen in the pic pic.twitter.com/pMRETRXOuo
— KTR (@KTRBRS) February 15, 2023